పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వనిరాకరణము

3

కావున మహాభారత తాత్పర్యజిజ్ఞాసువులకు ఈటీక అవశ్యాశ్రయణీయము. అందుచే నీలకంఠీయటీ కానుసారముగనే మహాభారతమును గూర్చి మనము కొన్ని మాటలనుకొందము.

————♦ మహాభారతనామనిర్వచనము ♦————

“ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకతః |
 (అ )పురా కిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతమ్ ||

చతుర్భ్య స్సరహస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా|
తదాప్రభృతి లోకే౽స్మిన్ మహాభారత ముచ్యతే||

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో౽ధికమ్
మహత్త్వాద్భారవత్త్వా చ్చ మహాభారత ముచ్యతే"

దేవతలుచతుర్వేదములను భారతమును న్యూనాధిక భావమున బరీక్షింప నుపనిషత్తులతో గూడిన చతుర్వేదములకంటె అర్థగౌరవరూపమగు నాధిక్యము శబ్దాధిక్యము దీనియందుండుటచే నీభారతమే మహాభారతమని చెప్పబడుచున్నదని తాత్పర్యము.

దీనిచే, భారతము మహాభారతము భిన్న గ్రంథములు కాక యేక గ్రంథమే యని మనకు స్పష్టమైనది.

————♦ మహాభారతరచనా పద్ధతి ♦————

ఈ మహా భారతరచనా పద్ధతిని గూర్చి గ్రంథముందిట్లు చెప్పబడినది___

"ఇతిహాసా స్సవైఖ్యా వివిధా శ్శ్రుతయో౽పిచ |
ఇహ సర్వమనుక్రాన్త ముక్తం గ్రన్థస్య లక్షణమ్ ||

విస్తీర్యైత న్మహజ్ఞాన మృషి స్సంక్షిప్య చాబ్రవీత్ |
దృష్టం హి విదుషాం లోకే సమాసవ్యాసధారణమ్”||