పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

శుభమస్తు

ఆవిఘ్నమస్తు

మహాభారత తత్త్వ కథనము.

అనేక కర్తృత్వ నిరాకరణము.

—————→∞∞∞∞∞∞∞←————————


'జయతి పరాశరసూను స్సత్యవతీ హృదయనన్దనో వ్యాసః |
య స్యాస్యకమలగళితం వాఙ్మయ మమృతం జగత్పిబతి' ||

"నమో౽స్తుతే వ్యాసవిశాలబుద్ధే |
           ఫుల్లారవిన్దాయతపత్రనేత్ర |
యేన త్వయా భారత తైలపూర్ణ:|
           ప్రజ్వలితో జ్ఞానమయః ప్రదీపః ||

సమ్య ఙ్న్యాయకలాపేన మహతా భారతేన చ |
ఉపబృంహితవేదాయ నమో వ్యాసాయ విష్ణవే" ||

పరమకారుణికుడును, పరాశరపుత్రుడును అగు శ్రీమద్వేదవ్యాసమహర్షి లోకానుగ్రహతత్పరుడై చతుర్దశవిద్యాస్థానరహస్యములనొక్కచోట బ్రదర్శించుచు, మందమధ్యమాధికారులనుగూడ ననుగ్రహించుటకై వైశంపాయన జనమేజయ సంవాదరూపమునను సౌతిశౌనకసంవాదరూపమునను హరివంశాంతము లక్షగ్రంథాత్మకమై హరివంశముకాక అష్టాదశ మహాపర్వములును, హరివంశముతోగూడ నవాంతర పర్వశతమును కల మహాభారత మను ఇతిహాసమును సాక్షాద్గణపతి లేఖకత్వమున రచించి యీ మనుష్యలోకమున ప్రతిష్ఠింపజేసెను.