పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

థరచనలో బ్రవర్తించితిని. ఈ ప్రవృత్తి కి మూల మీ యార్షవచనములే____


    "స్థాపయధ్వ మిమం మార్గం ప్రయత్నే నాపి హే ద్విజాః |
     స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేత్ ||
    
     యో హి స్థాపయితుం శక్తో న కుర్యా న్మోహితో జనః |
     తస్య హన్తా న పాపీయా నితి వేదాంతనిర్ణయః ||

     యః స్థాపయితు ముద్యుక్త శ్శ్రద్ధయైవాక్షమో౽ సన్ |
     సర్వపాపవినిర్ముక్త స్సాక్షాద్జ్ఞాన మవాప్నుయాత్ ||

     యస్తు విద్యాభిమానేన వేదమార్గప్రవర్తకమ్ |
     ఛలజాత్యాదిభి ర్జీయా త్స మహాపాతకీ భవేత్" ||

ఇచ్చట వైదిక మార్గమును స్థాపింపు డనియు, నది స్థాపింపబడిన సకలము స్థిరపడుననియు, దానిని స్థాపింప సమర్థుడై యుండి యెవ్వడు పేక్షించునో వాని నేమి చేసినను పాపము లేదని వేదాంతనిర్ణయ మనియు, అసమర్థుడైనను శ్రద్ధతో వైదికమార్గమును స్థాపింప నుద్యమించువాడు పాపవిముక్తుడై జ్ఞానమును పొందు ననియు, వేదమార్గప్రవర్తకుని అక్రమమార్గముల నోడించువాడు మహాపాతకి యగుననియు నుపదేశింపబడినది.

ఇందు అశక్తుడైనను శ్రద్ధతో వే దమార్గమును స్థాపింప నుద్యమించువాడు పాపవిముక్తు డగును. అన్న యుపదేశమే యాగ్రంథరచనలో నేనుద్యమించుటకు మూలము.

ఇట్లు:

గ్రం థకర్త.

♦∞∞∞∞∞∞∞∞∞∞∞∞♦