పుట:మహాపతివ్రతలకథలు - మద్దూరి శ్రీరామమూర్తి.pdf/5

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 క్రీస్తు J 2 మహా పతి స్తుల క థ లు మహాపతివ్రతల కధలు. సుకన్య చరిత్రము. మున్ను శర్యాతియను భూపాలుఁడు న్యాయమార్గంబున భూ వలయంబునుఁ జరిపాలించి పెక్కు వత్సరంబులు గడచినను సంతుగలు గకునికి చింతించి పరమేశ్వరుని బ్రార్ధించి యాతని యనుగ్రహంబున కొక్క పుత్రికను వడసెను. అతఁడా కుమారీమణికి సుకన్యయని నా మకరణ మొనరించి యధికానురాగంబునఁ బెంచుచుండెను. దిన దిన ప్ర్రవర్ధమానయై శుక్ల పక్ష క్షపాకరునిఁ బురుడించుచు నక్క న్యాశిలో మణీ యః్వర్ధ నామాభి ధానయై యొప్పుచుండెను. శర్యాతి నిండు కొలువుననున్న సమయంబున గొందఱు బోయ లరుదెంచి సాష్టాంగ దండపగ్రామము లాచరించి ఏనుగు దంతములు. కస్తూరి, పులిగోళ్ళు, మధువు మున్నగు వన్యంబులగు వస్తుచయంబును కొన్న గాని యాతనితో నిట్లనిరి. సామీ తమపాలనంబున నింతవఱకు సుఖంబున నుంటిమి కాని యిప్పుడు మేము నివసించు పల్లెలన్నియును - గ్రూరమెకంబులకు సంచార భూములయ్యెను. మాగోధనంబులను గాపొడజూలకుంటిమి. దేవరపచ్చి మాయాపదల దొలఁగింపవలయును అని విన్నవించిన విని శర్యాతి వారలకభయంబీచ్పి పంపి వేటకురివా రంబును సిద్ధపరుకు మంత్రి పుంగవున కాణి విడియంతః పురమున కేగెను,