పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


క.

మదవద్ద్విరేఫలీలా
స్పదసారసకేళిలోలసారసతతిచే
హృదయాహ్లాద మొనర్పఁగ
సుదతీమణు లొక్కకొలను జూచుచు వేడ్కన్.

83


సీ.

హరువులు మీరంగ నల్లిన జడ లూడ్చి
        పొలుపొంద వాలుగొప్పుల నమర్చి
రంగారు కనకాంబరంబులు సడలించి
        వలిపంబు లైన పావడలుఁ గట్టి
యందెలు తఱచైన హారమ్ము లెడలించి
        మెఱుఁగారు సొమ్ములు మేనఁ బూని
యందమై కనుపట్టు నపరంజియందెలుఁ
        జిమ్మనగ్రోవులుఁ జేతఁ బట్టి


తే.

గబ్బి వలిగుబ్బబరువునఁ గౌను లాడ
[1]నొక రొకరిచెట్టఁ బట్టుక యొఱపుమీరఁ
బొడము నూర్పులతావికై యడరు తేంట్ల
[2]జోపుచును జేరవచ్చిరి సొంపు మెఱయ.

84


వ.

ఇట్లు సరోవరతీరంబుఁ జేరవచ్చి.

85


క.

ఒండొరు మూఁపులు నిజభుజ
దండంబుల నూతగొనుచుఁ దఱుచుగ మదవే
దండగతు లమర సరసిజ
మండిత మగు కొలను సొచ్చి మలయుచు వేడ్కన్.

86


సీ.

తమ్మితేనియలను జిమ్ముచుఁ బుప్పొళ్ళ
        గుమ్ముచుఁ జేరంగ రమ్మటంచు
దొమ్మిగాఁ గూడుక తుమ్మిదల్ హరుని బ
        లమ్మని తోలుచు సమ్మదమున
నొమ్ముగా బంగారుబొమ్మలు నటియించు
        నెమ్మితో మెఱుగులు గ్రమ్మికొనఁగఁ

  1. నొకరుకరిచెట్ట
  2. సోఁపుచును