పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మన్నారుదాసవిలాసము


జెలువరో! చూచితే చెలువమై యున్నవి
        నారంగములును జంబీరములును
దరుణిరో! చూచితే దట్టమై యున్నవి
        ఖర్జూరములు గర్ణికారములును


తే.

మగువ! చూచితే మొల్లలు మల్లియలును
[1]బండిగురివెందపొదలును బొండుమల్లె
లల్లిబిల్లిగ నెల్లెడ నల్లుకొనుచు
నలరుగుత్తుల మిక్కిలి నలరె నిచట.

76


సీ.

మగువ పుక్కిట నించు మధువున నిగుడెను
        బొగడను పూవులు పూవుఁబోణి!
పడఁతి యందియతోడి పదమునఁ దన్నంగ
        ననిచె నశోకంబు నళిననేత్ర!
కన్నియ నవ్వినఁ గనుపట్టె నెల్లెడఁ
        బొన్నమ్రానున విరుల్ పుష్పగంధి!
కల్కిచన్నుల నాని కౌఁగిలింపఁగఁ బూచెఁ
        గురవకతరు విదె కుందరదన!


తే.

ఇంతి మో మెత్త సంపెంగ నెనసె ననలు
వనిత మూర్కొన్న వావిలి మొనసె సుమము
నతివ పలికిన గోఁగున నలరు లలరె
లలన గనుఁగొన్న మొగ్గలఁ దిలక మమరె.

77


చ.

అని చెలి నెచ్చరింపుచు రయంబునఁ గీల్ జడ లల్లి వేడుకన్
ఘనముగ నందియల్ మొరయఁగాఁ జరణమ్ముల మేనితావికిన్
మొనయుచుఁ దేఁటిగుంపులు బ్రమోదమున న్వెనువెంట నంటఁగా
ననుపమలీలచే వెలసి యంబుజలోచన లవ్వనంబునన్.

78


        రగడ (మధురగతి)
కనుఁగొను చెలువము కామిని! వనమున
నినిచెను వేడుక నెరయఁగ మనమునఁ
గొమ్మలు మును నేఁ [2]గోసిన క్రొవ్విరిఁ
దెమ్మని బలిమిని దియ్యఁగఁ గ్రొవ్విరి

  1. బండిగురివింద క. బండి గురివింద
  2. గ్రోసిన