పుట:మధుర గీతికలు.pdf/774

ఈ పుట ఆమోదించబడ్డది


గ్రంథనిలయంబు శారద కనకపీఠి,
గ్రంథనిలయంబు కవుల శృంగారవాటి,
గ్రంథనిలయంబు విబుధ విజ్ఞానపేటి,
గ్రంథనిలయంబు మోక్షసద్గతికి చీటి.

గ్రంథనిలయంబు నా యేడుగడయు, గతియు,
నాదు ప్రాణంబు, మానంబు, నా ధనంబు,
నాదు శక్తియు, భక్తియు, నాదు ముక్తి,
రక్తి - వేయేల - నాదు సర్వస్వమదియె.