పుట:మధుర గీతికలు.pdf/773

ఈ పుట ఆమోదించబడ్డది




విశ్వవిద్యాలయంబులు, పీఠములును,
గురుకులంబులు, పండితపరిషదాది
సంస్థ లొనరింపఁ జాలని సత్క్రియలను
లీలమై నెఱవేర్చు గ్రంథాలయంబు.

వ్యాసములు, పత్రికలు, నుపన్యాసములును,
సభలు, సమితులు, సంస్థలు, సంఘములును,
కడఁగి సాధింప నేరని కార్యములన
నేర్పుమై గ్రంథనిలయంబు నిర్వహించు.

ఐకమత్యము నెలకొల్పునట్టి దేది?
కులవిభేదన నిగళంబు డులుచు నేది ?
నిఖిల మత సామరస్యంబు నెఱపు నేది ?
సర్వజన పుస్తకాలయ సంస్థ కాదే ?

ఆత్మగౌరవ మొనగూర్చునట్టి దేది ?
ఆత్మవిశ్వాస మొనరించునట్టి దేది ?
ఆత్మసన్యాస మలరించునట్టి దేది ?
సర్వజన పుస్తకాలయ సంస్థ గాదె ?

అడుగు మేదేని - తోనె లే దనక యిచ్చు,
కోరు మేదేని - గొబ్బున కోర్కు లొసంగు.
వేఁడు మేదేని - వేగ నీ వేడ్క దీర్చు.
గ్రంథనిలయంబు కల్పవృక్షంబు గాదె?

52