పుట:మధుర గీతికలు.pdf/765

ఈ పుట ఆమోదించబడ్డది


ఒరుల కిచ్చిన తఱుఁగక పెఱుఁగునంత,
ఉద్ది వచ్చునె దీపిక విద్దెతోడ ?
ఓరుగాలికి దీపిక యారిపోవు?
విద్దె యను దివ్వె యారక వెలుఁగు జువ్వె.

యౌవనంబును సౌందర్య మలరుఁ గాక,
ధనము నున్నతవంశంబు తనరుఁ గాక,
లేశ మేనియు సద్విద్య లేనివాఁడు
శోభ గాంచఁడు నిర్గంధసుమము వోలె.

గ్రంథములు



కలఁత లడఁగించు, కష్టముల్ తొలఁగఁద్రోయు,
పాపములఁబాపు, బన్నముల్ పాఱఁద్రోలు,
మాంద్యమును మాన్సు, దుఃఖముల్ మఱవఁజేయు,
కావ్యములు మానవుల పాలి కల్పలతలు.

పుస్తకములన్న కేవల పుస్తకములు
కావు. ప్రస్తుత ప్రాచీన భావికాల
మానవుల జీవితంబుల, మానసముల,
భావముల, ధర్మముల నవి వ్యక్తపఱచు.

తరములను బట్టి విబుధులు దాఁచియున్న
జ్ఞానభండారములు గ్రంథసంపుటములు,
ధరణి వెలసినయందాక తఱుఁగఁబోని
వారసత్వపు హక్కులై వఱలు మనకు.

44