పుట:మధుర గీతికలు.pdf/761

ఈ పుట ఆమోదించబడ్డది

3. ఉప్పుదొరకనియూరు, ఉపాయములేని మనిషి యుండరాదు.
4. అప్పులేని ఉప్పుగంజి మేలు.
5. ఊపిరి యుంటే, ఉప్పు అమ్ముకొని బ్రతుకవచ్చును.
6 .ఉప్పులేని కూర, పప్పులేని పెండ్లి.
7 .ఉప్పుతో తొమ్మిది (రసములు) ఉండనిచ్చును.
8 .ఉప్పుతో తొమ్మిది, పప్పుతో వది ఉంటే, అందరూ వంటలక్కలే.
9. ఉప్పుతో ముప్పయారు ఉంటే, ఉత్తముండ ఐనా వండుతుంది.

10. ఉప్పులేక ముప్పందుము తింటానంటాడు.
11. ఉప్పుకు ఉపకారము లేదు.
12. వానియుప్పు దిని వానిమీఁదనే చేఁదుకాయలు కోసినాడు.
13. ఉప్పు, పత్తిరి లేనివాఁడు.
14. ఉప్పులేని ఊరగాయ యుండునా ?
15. వానికి ఎక్కడా ఉప్పు పుట్టదు.
16. పుట్టెడుప్పు ధారపోసినా, వానిముఖము చూడఁగూడదు.
17. ఉప్పుగల్లు వోలె నున్నవాఁడు.

18. వప్పే పస బాపలకును.
    ఉప్పే పస రుచుల కెల్ల, ఉవిదల కెల్లన్
    కొప్పే పస, దంతములకు
    కప్పే పస, కుందరపు కవిచౌడప్పా.
   
19. షణ్ణం రసానాం లవణం ప్రధానమ్.

40