పుట:మధుర గీతికలు.pdf/760

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"చని యా జనార్దనునిచే
ఘనమగు లవణంబు మనకుఁ గప్పమడుగు మే
ధనములును సరకు గా, విట
చనుదె మ్మను మతని యజ్ఞసమయమ్మునకున్."

రాజసూయయాగము జరుగు సమయమున, నరరాజన్యులచే "మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సంపదలు" కప్పములుగా నడుగుట రాజో చితమై యుండ, శ్రీకృష్ణునంతటివానిని హంసదిచికులు ఈపాటి యల్పమగు లవణ మును గోరు టేల ? మఱియు పైపద్యమున లవణము ఘనమైనదనియు, దానితో ఏ ధనములును సాటిరా వనియు వ్రాయఁబడినది. దీనివలన లవణ [1] మెంతటి లావణ్యమైనదో చదువరులు గ్రహింతురు. గాక.

శ్రీకృష్ణుఁడు ద్వారకావాసి, ద్వారక - సముద్ర పరివృత మైనది. సాళ్వదేశము మధ్యరాష్ట్రములోనిదగుటచే, సముద్రము నకు చాలదవ్వు తక్కిన పదార్ధముల కంటె అక్కడ ఉప్పు అపు రూపము ప్రియమునైనదిగా నుండును. కావుననే హంసడిచికులు కృష్ణుని నుండి ఉప్పు కప్పమును గోరియుందురు. ద్వారక గుజ రాతు దేశములోనున్నది. ఉప్పుపంటలో ఆ ప్రాంత మగ్ర గణ్యము. అచటి యుప్పు పెక్కుసంవత్సరముల వఱకుఁబ్రపంచ మున కంతకు వినియోగింప జాలియుండును.

ఉప్పు ఉత్కృష్టతను తెలుపు సామెతలు :

1. ఉప్పు పెట్టినవారిని ముప్పువఱకు మఱువరాదు.

2. అఱచేతిలో ఉప్పు పెట్టితే, ఆఱునెలలవఱకు తలచుకోవలెను.
  1. 'లావణ్య' పదము 'లవణము' నుండి ఉత్పన్నమైనది

39