పుట:మధుర గీతికలు.pdf/758

ఈ పుట ఆమోదించబడ్డది

మగు పదార్ధముగ భావింపబడెను. కాన దాని వ్యాపారము నిమి త్తము ప్రత్యేకముగ బాటలు వేయబడు చుండెడివి. అట్టివానిలో నొకటి యగు సాలేతియ (Salaria) అను బాట ఇప్పటికిని ఇటలీ దేశమున గాననగును. పూర్వము అబిస్సీనియా ఆఫ్రికా టిబేటు మున్నగుదేశములందు నాణెములకు బదులుగా ఉప్పుతో చేయఁ బడిన బిళ్లలు చెలామణి యగుచుండెడివట.

ఉపయోగములు :

మట్టిపాత్రలకు మెఱుఁగుపెట్టుటకును, గాజు సామాను లకు ధావశ్యము స్వచ్ఛత నిచ్చుటకును, సబ్బు బిళ్ళలను గట్టిపరచుటకును, రంగుల ధాతువులను పెంపొందించుటకును, మాంసాదులను చెడకుండ భద్రపఱుచుటకును, పశువుల గుగ్గిళ్లకును, సస్యములకు పురుగుపట్టకుండ ఎరువులో గలిపి పొలములకు వేయుటకును, తోళ్ళు పదును చేయుటకును. ఓడలు నావలు మున్నగువాని బల్లలు చెడిపోకుండ వాని సందులలో కూరుటకును ఉప్పు నుపయోగింతురు.


దీని యుపయోగము వైద్యశాస్త్రము జూచినఁ దెలియఁ గలదు. సమస్త రోగములకు ఉప్పే పరమౌషధ మని ఈనడుమ లవణానందస్వామి ఉప్పుతో చికిత్సలు చేసి రోగము గుదుర్చుట పత్రికలలో జదివితిమి. ప్రాణావసాన సమయమున వైద్యుఁడు రోగికి సెలైన్ ఇంజెక్షన్ అను పేర ఉప్పు కలిపిన నీటిని

37