పుట:మధుర గీతికలు.pdf/755

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అంగజాది వానరులఁ గూడుకొని
పొంగుచు లంకకుఁ బోదు గదా !
సంగరంబున రావణుఁ బొరిగొని
రంగుగ జానకిఁ దెత్తుఁ గదా ! -ఏమి

ఇప్పట్టున మనము మహాత్ముని బోధనల విడనాడి యుపేక్షింతుమేని, అనంతరము పశ్చాత్తప్తులమై 'మహాత్ముని సహజన్ముల మయ్యు, ఆతని సేవించి తరింపమైతిమి గదా !' యని పరిపరివిధములఁ బరితపింతుము. కావున మనమీ యమూ ల్యావకాశమును బోనాడుకొనక, మహాత్ముని దివ్యసందేశముల ననుసరించి శాంతిసమరమున నుఱికి-

'"హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీ"'

అను గీతావాక్యానుసారము - చచ్చిన స్వారాజ్యము బ్రతికిన సంపూర్ణ స్వరాజ్యము సాధించి, భరతవర్షమును దాస్యము నుండి విడిపించి మనుగడల ధన్యమొనర్చుకొందాము గాక!

ఉప్పు

ఉప్పు ఉత్పత్తియగు దేశములు -

ఉత్తర దక్షిణ అమెరికాలు. సైబీరియా, చీనా, పరిషియా, ఐరోపా, హిందూదేశములయందు ఉప్పు విశేష ముగ నుత్పత్తియగును. కేటలోనియా దేశమునందు 400 అడుగుల యెత్తును 3 మైళ్ళ పరిధియు గల గొప్ప ఉప్పుకొండ గలదు. అఫ్రికాయందలి సహరా ఎడారిలోను అబిసీనియా

34