పుట:మధుర గీతికలు.pdf/754

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరబ్రహ్మముగారి శిష్యులు వీరభోగవసంతరాయని యావిర్బావము నెదురు జూచుచున్నారు. తారకసంఘము (Star society) వారు తారకోదయమునకై ప్రాగ్దిశకుఁ దమ యాలోక నములఁ బర్వించుచున్నారు. భ్రుక్తరహితతారకరాజ యోగులు విరాట్పురుషుని సందర్శనార్థము తహతహలాడుచున్నారు.

పై మతములవారెల్లరు తమతమ యవతారమూర్తి గాంధి మహాత్ముఁడే యని నమ్మి తదాదేశములను శిరసా వహించు చన్నారు.

పురాకృత పుణ్యపరిసాకవశమున గాంధిమహాత్ముని సమ కాలీనులమై జనించు భాగ్యము మన కబ్చినది. ఇట్టి సదవకాశము మనకు మరల యెన్నిజన్మములకో కాని లభింపదు. తొల్లి రామ దాసు శ్రీరాముని కాలమున బుట్టినైతిని గదా యని ఈ తీరునఁ బలవించినాఁడు : -

కీర్తన


ఏమి నాపాపము ! అయ్యో ? ఏమి నాపాపము-
భూమిలోన శ్రీరాముని తోడను
బుట్టి పాదములఁ బట్టనైతిఁ గద ఏమి
వనజనాభునకు దాసుఁడ నైతే
వనములవెంటను జనుదుగదా !
కనకకురంగము జనకతనూజకు
నిచ్చిన రాముడు మెచ్చుగదా ! ఏమి

33