పుట:మధుర గీతికలు.pdf/753

ఈ పుట ఆమోదించబడ్డది

తరతరములనుండి దౌర్భాగ్యదశకు దాసులై భారతీ యులు అంథకారబంధుర మగు నావరణమున జిక్కి వివశులై విలవిల తన్నుకొనుచున్నారు. సాధుత్వమున శఠత్వమును, సౌజన్యమున దౌర్జన్యమును పరాస్తము జేయుదుమేని, ఆ యంధ కారావరణము భగ్నమై మానవలోక మంతయు నవ్యజీవన జ్యోతి నాశ్రయింపగలదు.

ఆర్తలోకసంరక్షణమునకై సత్యాగ్రహము ననుసంధించిన గాంధీమహాత్ముని, క్రైస్తవులు పెక్కుసారులు బంధించి తమ పిఱికితనమును వెల్లడించుకొనిరి.

దేనికొఱకు మహాత్ముఁడు దురంతకష్టములకులోనై నాఁడో, దేనిని సిద్ధింపఁజేయుట కాతఁడు తనజీవితమును మహా యజ్ఞముగఁ గావించియున్నాఁడో, ఆ పవిత్రాదర్శమును మనము దృఢదీక్షతో సాధించి, లోకకళ్యాణము నొనగూర్చుటకై మన ప్రాణ మాన ధనముల నర్పింతము గాక

——————

స్వస్తివాచకము

సనాతన హిందూమతాచారపరులు కల్కిమూర్తి యావిర్భా వమునకై కుతూహలితులై యున్నారు. కైస్తవులు జీససు పునర వతారమునకై విశ్వాసమున బ్రతిక్షించుచున్నారు. దివ్యజ్ఞాన సామాజికులు మైత్రేయాగమనము నాసించి నిరీక్షించుచున్నారు

32