పుట:మధుర గీతికలు.pdf/751

ఈ పుట ఆమోదించబడ్డది

నున్న ఒత్తిడులను ఒత్తిగింపఁగలదు. వ్యవసాయమును పెంపొం దించి ఫలవంతముగఁ జేయఁగలదు.


తలఁవనితలంపుగ ఇయ్యది భారతజాతిని భారత విజ్ఞాన మును నానాముఖముల వికసింపఁ జేయుటయేకాక, భారత దేశీయ నిజప్రభావమును పాశ్చాత్యదేశము సంభావించుట కనువగు రాజ మార్గము నేర్పఱచి ప్రాచ్య పాశ్చాత్యఖండములకు సుహృద్భా వము గూర్పగలదు."

[1]

సత్యాగ్రహోద్యమ తత్వము

“ద్వేషమును ప్రేమమునను, దౌర్జన్యమును, సౌజన్య మునను, అసత్యమును సత్యమునను మార్కొని సాధించుకొఱకు పూర్వము సమస్తమతములచేఁ బ్రసాదితమైన దివ్యసత్యమును విశ్వమునందంతట వ్యాపింపజేసి అనుష్టింపఁ జేయుటయే నేఁటి సత్యాగ్రహోద్యమము యొక్క పరమోద్దేశము.


తొల్లి లోకసంగ్రహార్థము మహర్షులు తమయుపదేశ ముఖమున దివ్యసందేశములం దెలిపిరి, జీససు బోధించిన సిద్ధాం

తములు సరాసరిగ గాంధీమహాత్ముని తత్త్వోపదేశములయందు

  1. ఈవ్యాసము మీరాబాయి (స్లేడ్ కవ్య) అను పాశ్చాత్య విదుషి రచించినది. ఈమె మహాత్ముని శిష్యురాలై అతనికి శుశ్రూష చేయుచు సబర్మతి యాశ్రమమునఁ గడపుచున్నది.

30