పుట:మధుర గీతికలు.pdf/750

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచసంగ్రామము యూరపునందలి యంతర్భేదముల నొక్క పెట్టునఁ దుత్తునియలు గావించినది. కాని బ్రిటనునందలి శాఖావిభేదములు నేటికిని చెక్కు చెదరక ఘనీభవించియున్నవి. అచ్చట సాంఘిక రాజకీయ వ్యవస్థలు కేవలము కృత్రిమ కల్పిత ములు; అవి తర తమ పదవుల విభాగముల నండఁగొని యున్నవి. బిరుదముల సంపాదించి భారాబఋఊల నందుటయే అచటి హేమా హేమీల ముఖ్యలక్షణము. శాఖాభేదములే అచటి సాంఘిక పారి శ్రామిక వృత్తుల మీఁద నధికారము చెలాయించుచున్నవి. వీని నన్నిటిని రాజ్యాంగయంత్రము త్రిప్పుచుండును. భారతసామ్రాజ్య స్వాతంత్య్ర ఝంఝూమారుతము ప్రచండతరముగ వీచి, ఆ మహాయంత్రమును ఒక్క పెట్టున నూటాడించి పటాపంచలు సేయఁగలదు; అంతట దానిచే నడపఁబడుచున్న కుతాంత్రిక పరి కరము లన్నియు మటుమాయము, అగును. ఇట్లు సహస్రాబ్దముల నుండి యూరపు జీవితము నెల్ల కలుషిత మొనర్చుచున్న దుష్కృతరాశిని ఒక్క త్రుటిలో నీ సత్యాగ్రహాస్త్రము భస్మీ పటలము గావింపగలదు.


ఆర్థికముగఁ గూడ దీనిఫలికము లగణ్యములు, ధనమదాం ధతను సాంగ్రామిక విధాహమును నిర్మూలించుట కీసత్యాగ్రహము దీవ్యౌషధము. ధమబ్రమత్తతను అడంచుటకు ఏ సాంఘిక విప్లవ మునకును సాధ్యము కాని మహా శక్తిని సాధించి ప్రసాదింపగలదు. ఇది వర్తకసరళిని జక్కబెట్టఁగలదు. పారిశ్రామిక వృత్తులమీఁద

29