పుట:మధుర గీతికలు.pdf/749

ఈ పుట ఆమోదించబడ్డది

అల్పసంఖ్యాకులు తమ కుక్షింభరత్వమునకై నిర్నిమిత్తముగ నిర్దాక్షిణ్యముగ ప్రజల హృదయములను క్షోభపెట్టి స్వార్ధపరా యణులై విశృంఖలముగఁ జెలరేగు చున్నారు. ఈ కారణముననే ప్రకృతసంఘర్షణ మావహించినది; దీనివిజయము ఈ వర్తమాన మందలి ప్రతిప్రభుత్వము యొక్క బలమును నిస్సార మొనర్చి దానిపద్ధతిని పూర్తిగ సంస్కరింపగలదు. ఇది ముమ్మాటికి నిశ్చ యము. ప్రపంచమందలి ప్రభుత్వములలో నెల్ల బలవత్తమమైన ప్రభుత్వమును ప్రతిఘటించిన ఈ సత్యాగ్రహము యొక్క విజ యము తక్కిన అన్ని ప్రభుత్వముల కుళ్ళును బయటవేయగలదు. నేటి ప్రభుత్వ విధానములయందలి పరువు ప్రతిష్ఠలను కూడ నీ సత్యాగ్రహము క్రుంగదీయగలదు. ప్రపంచమునం దెల్లెడల స్వాతంత్య్రశక్తుల నొక్కుమ్మడి పరివ్యాప్తము ఝాఏసి ప్రజ్వలింపఁ జేయగలదు. పరిపాలనమున కగ్గమై మ్రగ్గుచున్నవారెల్లరును నల్ల వారైన నేమి, పాటకపుజనులైన నేమి, పాలకులతో సమాన స్వాతంత్య్ర మనుభవించుచు స్వేచ్ఛడోలికల నోలలాడఁగలరు. రష్యా విప్లవము దేశ దేశముల నావరించి ప్రజాసామాన్యమునందు గొప్ప సంచలనము రేపినది. అప్పుడు వణిక్ప్రభువులును సంస్థా నాధిపతులును భీతిచేఁదల్లడిల్లిరి. ప్రాపంచిక చరిత్రయందింత దనుక బయల్వెడలిన ఏ విప్లవములు ఒనగూర్పఁజాలని ప్రజా స్వాతంత్య్రమును నేఁడు భరతఖండమున విజృంభించిన ఈ సత్యా గ్రహము తప్పక సమకూర్పగలదని నానమ్మకము.

28