పుట:మధుర గీతికలు.pdf/747

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆతనితండ్రి వాయుదేవుఁడు ఇంద్రునిపై నలిగి తనమూర్తి నుపసంహరించుకొనెను. అట్టియెడ -


యాజకుల్‌ వహ్ని హవ్యములు వేల్వఁగఁ జూచు
           హస్తముల్‌ సాచినయట్టు లుండె;
దివిజులు ప్రేరేఁప దివి కెగిరిన దేవ
           యానంబు లెగిరిన యట్టులుండె;
మునులు నదీతోయములఁ దోఁగ ముంచిన
           యం గముల్‌ ముంచిన యట్టులుండె;
పశు మృగ నరముఖ ప్రాణు బుర్వినిఁ బెట్టు
           నడుగులు వెట్టినయట్టులుండె;

భానుమండల మొక్కచోఁ బాదుకొనియె;
కాలగతి తప్పె; సత్క్రియల్‌ గడచె; పేద
పాఠ ముడివోయె; బాహ్య మభ్యంతరంబు
గాడ్పు బంధించి చనిన యక్కాలమదు.

-ఉత్తరరామాయణము ఆ 5. ప. 111.

ఈ యహింసాతత్త్వమును ఈ యుగమున బోధించిన మహనీయులు మా యెఱింగినంతవఱకు బుద్ధుడును జీససును పేర్కొనఁదగి యున్నారు. ఈ తత్త్వమును బుద్ధుఁడు కేవలము సాంఘికముగ వినియోగించినాఁడు; జీససు ధార్మికముగఁ బ్రయోగించినాఁడు. గాంధీమహాత్ముఁడు దీనిని భౌతికాధ్యాత్మి కాది సమస్త వ్యవస్థలయందును సర్వతోముఖముగ నావేశింపఁ జేసి విశ్వజనీన మొనర్చినాఁడు.

26