పుట:మధుర గీతికలు.pdf/746

ఈ పుట ఆమోదించబడ్డది

నాఁడు; బరదోలీ ప్రముఖ పుణ్యక్షేత్రములలో విజయోత్సవములు నడపినాఁడు. నేఁడు గూడ ఈ దివ్య యోగ ప్రభావముననే భూమండలమునం దెల్ల మహోద్దండ బలప్రచండు లని పేరు మోసిన బ్రిటీషుమండలాధీశ్వరులం డీ కొని గజిబిజి గావించి యున్నాఁడు.

అహింసాత్మక మైన ఈ మహాయోగ ప్రభావము అపూర్వము - అద్భుతము.. అద్వితీయము, అనూనము - అనుపమేయము - ఆమోఘము. ప్రపంచమును దీని నెవ్వరు నింతదనుక నవలంబింపలేదు. యుగాంతరములనాటి ఈ మహా యోగమున కీ యుగమున మహాత్ముఁడే ప్రాణప్రతిష్ఠ గావించి నాఁడు; ఇది భారతఖండమునకే గాదు సమస్తఖండములకును ఆఖండశాంతిని బ్రసాదించుట విశ్చయము; ఇది పాశ్చాత్యులు గూడ ఇప్పుడు గ్రహించుచున్నారు.

ఈ వైముఖ్యయోగమహిమం దెలుపుటకు ఉత్తర రామాయణమునందలి యొక యుపాఖ్యానము విట నుదహ రింతము.

తొల్లి హనుమంతుఁడు బాల్యచాపల్యమున తరుణార్క బింబమును పక్వఫలముగ భ్రమించి మ్రింగబోయెను. ఇంద్రుడు తన వజ్రాయుధమున నాతనిమూతిపై మోదెను. ఆ తాకుడు నకు ఆతఁడు నేలఁగూలి మూర్చా క్రాంతుఁడయ్యెను. అంత

25