పుట:మధుర గీతికలు.pdf/745

ఈ పుట ఆమోదించబడ్డది

మవతరించిన మహాత్ముల లీలలు మానవ సామాన్యమునకు దుర్ఙ్ఞే యములు, కావున గాంధీమహాత్ముని మహిమ సమ్యగ్దృష్టి నవలో కించువారికిఁగాని గోచరింపదు.

ఇంతదనుక రామకృష్ణాద్యవతారములతో బాటు మహాత్ము నకు సమానప్రతిపత్తి నొసగితిమి, దీనితో మాకుఁదృప్తి గలుగుట లేదు; వారికన్న ఉన్నతపదవి నధిష్ఠింపఁజేయుటకు మేముసక్ర మింతుము.

ధర్మ సంరక్షణార్ధము రామకృష్ణాదులు దుష్టులను సంహ రించిరి; లోకమును సముద్ధరించిరి. కాని వారిని సంస్కరించి పశ్చాత్తప్తులఁ గావించి సన్మార్గమునఁ ద్రిప్పజాలరైరి. మహా త్ముఁడు అట్లుగాదు. అద్వితీయమగు తన [1] వైముఖ్యయోగము (నాన్ కో ఆపరేషన్) ననుసంధించి విమతుల నెల్ల పశ్చాత్తప్తుల గావించి స్వమతమున కాకర్షించి సాధువులనుగఁ బరివర్తనము జేసి సంకల్పసిద్ధుఁడు గాగల్గినాడు. సటావిక్షేపణ మొనర్చు సింహ యూధమును జింకపదుపుగ మార్చివేయుటయే అతని యవతారము నకు పరమోద్దేశము; అదియే పరాకాష్ఠ. ఈ వై ముఖ్యయోగ ప్రయోగముననే ఆతఁడు దక్షిణాఫ్రికాలో విజయదుందుభిని

మ్రోగించినాడు; చాంపరాన్ లో విజయ ధ్వజారోహణ మొనర్చి

  1. ఇది యోగములలో నొకటి.

24