పుట:మధుర గీతికలు.pdf/744

ఈ పుట ఆమోదించబడ్డది

లీలలు అలోకసామాన్యము లనియు, జనులు గుర్తెఱుగుటకుఁ జాలినంత ఋజువు చేయగల వనియె మా నమ్మకము.

కొందరు “మహాత్ముఁడు లోకోత్తరపురుషుఁ డైనఁ గావచ్చును గాని, అవతారమూర్తి కాఁడు; అవతారపురుషుల కుండఁ దగిన యద్భుతమహిమ లాతనియం దొక్కటియు గాన్పించి యుండ లేదు; తన్ను బంధించినపు డైనను, శ్రీకృష్ణునివలె విశ్వరూప మేదేనిఁ జూపఁ గలిగెనా?" అని తర్క వితర్కములఁ జేయువారు గల రని మే మెఱుఁగక పోలేదు.

అట్టివారికి మా సమాధాన మిది :- శ్రీరాముఁడు విష్ణ్వంశ సంభూతుఁడుగఁ బరిగణింపఁబడుచుండియు, స్వస్వరూప జ్ఞానము లేని ప్రాకృతునివలె సీతాపహరణ సమయమునను, లక్ష్మణ మూర్ఛాఘట్టమునను విలపింపలేదా ? శ్రీకృష్ణుఁడు లీలా మానుష విగ్రహుఁడై స్థితప్రజ్ఞుడయ్యు శిశుపాలాదు నాతని మహిమ గుర్తెఱుఁగక తూలనాడలేదా? జరాసంధప్రభృతులు తఱిమి నపుడు సామాన్యునట్లాతఁడు పరువిడలేదా? ఇంతమాత్రమున వారి భగవదంశ సంభూతికి గొఱఁత గలిగిన దనఁ జెల్లునా ? దివ్య విషయములం గూర్చి సంశయించుట ఆత్మవినాశ హేతుకము గాదా ?

"సురల జన్మంబులు, శూరుల జన్మంబు, లేఱుల జన్మంబు లెఱుకపడవు" అను భారతవచన ప్రకారము, లోకసంగ్రహార్థ

23