పుట:మధుర గీతికలు.pdf/743

ఈ పుట ఆమోదించబడ్డది

మహాత్ముని యవతారము గూడ ద్వాదశీతిథి యందేయని "ఆత్మకథ” వక్కాణించినది. కల్కి మూర్తి జైత్రయాత్ర వెడలి నపుడు, అశ్వారూఢుఁడై తఱలెనని పురాణప్రసిద్ధము. మహాత్ము డును మొన్న లవణ సత్యాగ్రహమునకై దండుతో దండికి మహా ప్రస్థానము గావించినపుడు, అశ్వసమేతుడై వెడలెనని మన మెల్లర మెఱిఁగిన విషయమే.

పై దృష్టాంతములవలన, గాంధీమహాత్ముఁడు కల్కి మూర్తి యనియు, ప్రకృతము దేశమునందలి దుర్దశల నెల్లఁదొలఁగించి, విశ్వమునందెల్ల ధర్మరాజ్యమును సంస్థాపింప నవతరించె ననియు సిద్ధాంతమగుచున్నది.

———————

ఫ ల శృ తి

ఇంతదనుక గాంధీమహాత్ముని లీలలు విష్ణుని దశావతార లీలలతో సమన్వయించి సాదృశ్యములం బ్రదర్శించితిమి. వ్రాయ దగు నంశములు బెక్కులుండియు గ్రంధవిస్తర భీతిచే గొన్నిటిని. మాయల్పబుద్దికి స్ఫురింపక కొన్నింటిని విడువవలసినవార మైతిమి. మఱియు జీససు, మహమ్మదు మున్నగు మహాప్రవక్తల చరిత్రములతోడను ఉపదేశములతోడను సరిపోల్చి చూపదగిన విషయము అనేకములు మహాత్ముని లీలలఁతో గల వని యెఱింగియు, ప్రకారాంతర మగుటచే వదలితిమి. మా వ్రాసి నంతనట్లు మహాత్ము డొక యవతారమూర్తి యనియు, అతని

22