పుట:మధుర గీతికలు.pdf/742

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరించి ధర్మసముద్ధరణముఁ గావించు నని మన పురాణములు ఐకకంత్యముగ నుద్ఘోషించుచున్నవి. గాంధిమహాత్ముడేఁ ఆ కల్కిమ్తూర్తి యని ఈ క్రింది నిదర్శనములు నిరూపింపఁ గలవు.

పై పద్యములలో “భూమి నధర్మముల్‌ డులుప" అను పద్యమునందు “శంబరగ్రామమునన్‌ బ్రధానుఁడగు బ్రాహ్మణు నింట జనించుఁ గల్కియై” అని యున్నది. ఈ “శంబర" గ్రామము “శబరమతి” కి అన్వయించును. ఇఁక “ప్రథానుడగు బ్రాహ్మణునింట" అను వాక్యముఁ 'గూర్చి విచారింతము- మహాత్ముని తండ్రితాతలు రాజులకడ ప్రధానులు (మంత్రులు) గా నుండి రని మహాత్ముని 'ఆత్మకథ' తెలుపుచున్నది. మహాత్ముడును ఆతని జనకుఁడును జన్మమున వైశ్యులై నను, గుణకర్మములందు బ్రాహ్మణులే యగుదురు. మఱియు పై పద్యములలోఁ గడపటి రెంటియందును “సాత్త్వికబుద్ధి” “సాత్త్వికస్ఫురణ” అని కల్కిమూర్తికి విశేషణములు ప్రయో గింపఁబడినవి. సాత్త్వికనిరోధమే (Passive resistance) ప్రధాన సాధనముగాఁ గల మహాత్ముని కెట్లావిశేషములు వర్తిం చునో, ఆతనిచరిత్ర ఎఱిగినవారికిఁ గరతలామలకము.


......... ......... ......... ........ ......... .............. నవగ్రహంబులున్
దివి శుభంబు లైన తమ టెంకుల నుండఁగ ద్వాదశీతిథిన్
దేవవిభుండు ...... ..... నుద్భవ మందె దేవతల్‌
గావఁగలండు లోకములఁ గల్కి యటంచును సంస్తుతింపఁగన్

-కల్కి పురాణము. అ. 1. 139.

21