పుట:మధుర గీతికలు.pdf/741

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మఱియు ధనంబ కులాభిజాత్య హేతువు; బలంబ ధర్మ హేతువు; మనోహరంబ దాంపత్య హేతువు; స్త్రీత్వంబ ఉపభోగ హేతువు; అన్యాయంబ వృత్తి హేతువు; దౌర్బల్యంబ అధమ హేతువు; సద్వేషభారణంబ పాత్రహేతువునై, యనేక భీషణ దోషవిశేషంబులు సమస్త వర్ణంబులయందును గలిగియుండు.”


"అర్థ మిచ్చె నేని యధమాధముని నైన
ఆశ్రయింవ జూతు రఖిలజనులు;
సూనృతంబు బలము శూరత్వమును లేదు,
కల్లతనమె గలదు కలియుగమున!

[ఇట్టి యధర్మవర్తనంబులు గల కలికాలంబున]


భూమి నధర్మముల్‌ డులుపఁ బూని ముకుందుడు సర్వలోకర
క్షామణి భక్తవత్సలుఁడు సాత్త్వికబుద్ది యెలర్ప శంబర
గ్రామమునం బ్రథానుడగు బ్రాహ్మణునింట జనించు గల్కియై
అ మహనీయ మూర్తి తెగటార్చుటను మ్లేచ్ఛకిరాత జాతులన్.

"నిజధర్మంబున వేదముల్‌ ధరణిపై నిండం బ్రతిష్ఠించి సా
ధుజనవ్రతము నాచరించి, యొకచో దోషంబు లేకుండఁ జే
సి, తనంబుల్‌ పరమానురాగమునఁ దాఁ జెందించువాడై యథో
క్షజు డుండున్‌ బటు సాత్వికస్ఫురణతో కల్కిస్వరూపంబునన్."

-విష్ణుపురాణము

ఇఁకఁ బ్రకృత మనుసరింతము -

పై వివరింపఁబడిన కలియుగలక్షణము లన్నియు. తూచా తప్పక ప్రకృతమునఁ బ్రత్యక్షమై సాగుచున్నవి, ఇట్టి మహో త్పాతసమయమున శ్రీమహావిష్ణువు కల్కి మూర్తియై యవ

20