పుట:మధుర గీతికలు.pdf/740

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యణుఁడై బ్రహ్మచర్యము, పతితజనోద్దరణము, విశ్వసౌభాతృ త్వము, స్వార్ధత్యాగము, అహింస మున్నగు ధర్మములను మర్త్య కోటి కుపదేశించి, స్థిరమగు సంపూర్ణస్వరాజ్యపద్ధతికి మార్గము నిర్ధారణ మొనర్చి, తత్సంకల్పసిద్ధికి సత్యాగ్రహ యోగముద్ర నవలంబించెను.

10 కల్క్యవతారము.

సత్యయుగ సంస్థాపనము.


“ధరణీరక్షణ మాదరింపక నృపుల్ దర్పంబునం బశ్యతో
హరులై సాధుల దోఁచి చేకురు తదీయ స్రీ ధన క్షేత్రముల్‌
హరియింపం గలవారు, దారుణతరం బై సెల్లు జెల్లుం బర
స్పరవైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణినాశంబుగన్.

. . . . . “మేధాహీనులై మ్లేచ్ఛాకారులగు రాజులు భూభాగం బేలుచు ధర్మసత్యదయాహీనులై క్రోధ మాత్సర్యంబుల స్త్రీ బాలగోద్విజాతుల వధియింపన్‌ రోయక పరధన పర స్త్రీ పరులై రజ స్తమో గుణరతులై, అల్పజీవులై, ,అల్పబలుల్లై తమలో నన్యోన్యవై రానుబద్దులై సంగ్రామరంగంబుల నిహతులయ్యెదరు. ఆ సమయంబున ప్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు.

-భాగవతము


“బలిమి గలవాఁడె రాజు; సంవదలు గలుగు
నతఁడె మాన్యుఁడు; సభల మాట్లాడ నేర్చు
నతఁడె పూజ్యుడు; కొల్చినయతడె హితుఁడు
జనుల కెల్లను - కలియుగ సమయమందు.

19