పుట:మధుర గీతికలు.pdf/739

ఈ పుట ఆమోదించబడ్డది

అధినివేశన ప్రతిపత్తి (డొమియన్ స్టేటస్) యైన నిమ్మని రాయబారము నెఱపెను. బ్రిటిషువారు ఆతనినుడుల పెడచెవిని బెట్టి, భారతీయుల నిడుమలఁ గుడుపుటయ కాక, ధర్మమూర్తి యగు మహాత్మునే బంధించిరి. ఇకఁజేయునది లేక, మహాత్ముఁడు భారతీయుల గూడి శాంతిసమరమున కురవడించి తరుణభారత (యంగిండియా) మను శంఖమును బూరించి, రాట్నము అను చక్రమును, అహింస యను గదను చేతఁదాల్చి పరరాజుల గుండియలు కలగుండు పఱచి భారతీయులకు స్వరాజ్యముం గూర్ప దీక్ష బూనెను.


బుద్ధావతారము

జీవకారుణ్యమ


ఐహికము రోసి, లోకహితైకదీక్ష
బ్రహ్మచర్యంబు నాత్మనిగ్రహ, మహింస
భూతదయయు ప్రజాళికి బోధ సేయ
నవతరిల్లిన బుద్దమహాత్ము నెంతు.

తొల్లి - గౌతమబుద్ధుఁడు రాజ్యభోగముల నెల్ల విడనాడి విరాగియై తపోవనమున కేగి, భూతదయ, అహింస, ఇంద్రియ నిగ్రహము మున్నగు ధర్మములను అఖిలమానవ ప్రపంచమునకు బోధించి నిర్వాణపథము బ్రదర్శించెను.

నేఁడు - గాంధిమహాత్ముఁడు ఐహికభోగముల నన్నిటినిఁ ద్యజించి, దరిద్రనారాయణపద మాశ్రయించి, జగదుద్దరణ పరా </poem>