పుట:మధుర గీతికలు.pdf/738

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ముఁడు సత్యాగ్రహ భూధరమును ధరించి పగతుర పీచ మడంచి, భారతలోకముయొక్క మాన ప్రాణధనములం గాపాడఁ గంకణము గట్టెను.

స్వరాజ్యప్రదానము

తొల్లి - కౌరవులు పాండవుల పైతృకరాజ్యమును కపట వృత్తిచే నపహరించి, వారిని పాంచాలీపరాభవము మున్నుగాఁ బెక్కు లిక్కట్టులఁ బెట్టి ప్రవాసముల పాలొనర్చిరి. శ్రీకృష్ణుఁడు పాండవుల దుస్థ్సితికి విషాదమొంది, ధర్మజాదుల పక్షమున కౌరవుల కడకు వెడలి, పాండవులకు రాజ్యమునఁ గొంతయైనఁ బాలీయ మని సామవాక్యముల సంధి నడపెను. కౌరవులందుల కొడంబడక, మీఁదుమిక్కిలి శ్రీకృష్ణుని బంధింప సాహసించిరి. అంత పాండవులు శ్రీకృష్ణసహాయులై ధర్మయుద్ధమునకు దలపడిరి. శ్రీకృష్ణుఁడు పాంచజన్యముంబూరించి కౌరవబలము నొంచి ధర్మ రాజాదులకు సంపూర్ణ స్వరాజ్యము స్వాధీన మొనర్చి దిగంత విశ్రాంతయశోవంతుఁడయ్యెను.

నేడు - బ్రిటిషువారు భారతీయుల పరంపరాగత మగు భరతఖండమును కుతంత్రములచే నాక్రమించి, వారిని పాంచాల పరభవాది దుర్భరసంఘట్టనలఁ జీకాకుపరచి కఠినదండనలకు గుఱి చేసిరి. గాంధీమహాత్ముఁడు భారతీయుల పరాధీనజీవనమునకును దురవస్థలకును దురపిల్లి, వారికి సంపూర్ణస్వరాజ్యము కాకున్నను,

17