పుట:మధుర గీతికలు.pdf/737

ఈ పుట ఆమోదించబడ్డది

(కరమ్‌చంద్ గాంథి) వారి అవివేకమునకు పరాధీనజీవనమునకు వగచి వారి నిట్లు ప్రబోధించెను,

“పెక్కు వేలమైళ్ళ దూరమున నున్న బ్రిటిషువారికిని మనకును సంబంధమేమి? వారు భేదోపాయమున మనల వంచించి మనదేశము నాక్రమించి మనసంపదల నెల్ల హరించుచున్నారు. క్షీణించిన మన కృషి వాణిజ్య పశుపాలనాది వృత్తుల పెంపు గావించుకొనినచో వారితో నెట్టి సంపర్కము లేక మనయంతట మనమే యధేష్టముగ స్వతంత్రపాలనమును ప్రతిష్ఠించికొని సంతతసౌఖ్యానందముల నోలలాడఁ గలము. మహోన్నత మహీధరము లిందుగలవు; పావనవాహిను లిందుఁ గలవు; మనోహర పుష్పఫలభరిత భూజరాజము లిందుఁ గలవు. నిరుపమసౌభాగ్యనిలయమై నిత్యశోభనమై విరాజిల్లు నీ రత్నగర్భను ఈ సస్యశ్యామలను, ఈ కర్మక్షేత్రమును, ఈ వీరభూమిని, ఈభారతమాత నారాధింపుఁడు."

ఇట్లు హెచ్చరించి భారతీయుల మేల్కొల్పి, వారిని విదేశ ప్రభుత్వ దాస్యశృంఖములనుండి విడిపించి, మాతృదేశ సమారాధనమునకుఁ బురిగొల్పెను. ఇందునకు, బ్రిటిషు ప్రభుత్వమువారు దూరాగ్రహావేశజ్వాలతో మండిపడి, భారతీయుల నిర్బంధశాసన పరంపరల గుప్పించి ముప్పు తిప్పల ముంచి వేధించిరి. ఈ దుస్సహ దుష్ప్రయోగములకు భారతీయు లెల్లరు దురసిల్లి తల్ల డిల్లి హాహాకారములు గావించిరి. ఆ వివత్సమయమున

16