పుట:మధుర గీతికలు.pdf/736

ఈ పుట ఆమోదించబడ్డది


'కర్మమునఁ బట్టు జంతువు,
కర్మమున సమృద్ధిఁ జెందు. కర్మమునఁ జెడున్;
కర్మమె నరులకు దేవత,
కర్మమె సుఖదుఃఖములకు, గారణ మధిపాః

                                    --విష్ణుపురాణము

అట్లగుటం జేసి, కర్మపరుల మగు మనకు కర్మ యోగమే రమధర్మము కాన ప్రకృతిప్రీత్యర్ధము గోగిరుల నుపాసింతము.

ఇట్లు వచించి, యాదవులచే ఇంద్రోత్సవము మాన్పించి గోవర్దనోత్సవమునకు వారిం బ్రోత్సహించెను. ఇందున కింద్రుండు కినిసి గోవులమీఁదను గోపాలురమీఁదను ఱాళ్ళవాన గురిపించెను. ఆ బెట్టిదపు తుపాను తాకుడునకు గోగణంబులును గోపాలజనంబులును నొచ్చి ఆర్తనాదములు గావించుచు విచ్చి పఱవఁ జొచ్చెను. అట్టియెడ, పరమదయాళు డగు గోపాలుఁడు గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని పరాభూతునిం గావించి గోబృందమును గోపాలవర్గమును రక్షించి, గోవిందు డని ఖ్యాతి నందెను.

నేడు - భారతీయులు పరతంత్రులై బ్రిటిషువారి పాలనమునకు లోఁబడి, తద్వ్యామోహవాగురులం జిక్కి, వారియేలు బడియె తమకు ఏడుగడ యనియు. భుక్తి ముక్తిదాయక మనియు నమ్మి, వారికి దోసిలొగ్గి దాసోహ మ్మని కప్పములు కానుకలు జెల్లించుచుండిరి. అట్టియెడ కర్మచంద్రుఁడు

15