పుట:మధుర గీతికలు.pdf/734

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. శ్రీరామావతారము.

ధర్మరాజ్య ప్రతిష్ఠాపనము.

తొల్లి - రావణుఁడను రాక్షసరాజు మాయచే సీత (భూమిజ) నపహరించి సింగలదేశమున (లంకలో) బంధించెను. శ్రీరాముఁడు వానరసమేతుఁడై వెడలి రావణ మేఘనాధాది నిశాచరులఁ బొరింగొని, భూమిజను చెరనుండి విడిపించి, ధర్మరాజ్యమును సంస్థాపించెను.

నేఁడు - [1]ఇరావణుఁడు (ఇర్విను) భారతరాజ్యలక్ష్మిని కొల్లఁగొని ఇంగలదేశమున బంధించెను. గాంధిమహాత్ముఁడు శాంతిసైన్యమును వెంటఁగొని ఇరావణ మేగ్డనాల్డాది మ్లేచ్ఛ ప్రభువుల గర్వభంగము గావించి, భారతభూమిని నిర్భంధము నుండి విడిపించి, ధర్మరాజ్య ప్రతిష్ఠాపనము గావింపఁబ్రతిన పట్టెను.



ఇరావణుఁడు [ఇరివిన్] బ్రిటీషు రాజప్రతినిధి - రావణుఁడు (దానవరాజు)

మేగ్డనాల్డు [బ్రిటీషు ప్రధానమంత్రి] - మేఘనాధుఁడు (రావణుని యాత్మజుఁడు)

గాంధిమహాత్ముఁడు భారతరాజ్యలక్ష్మి - శ్రీరాముడు సీత (భూమిజ)

ఇంగలదేశము [భారత లక్ష్మిని కొల్లగొనుచున్న లంకాషైర్ గల దేశము] - సింగలదేశము (లేక) లంక.

శాంతిసైన్యము - వానరసైన్యము

  1. తమిళమున రామ రావణాది పదములకు ముందు 'ఇ' ప్రత్యయము వచ్చును. ఇరామన్, ఇరావన్, ఇత్యాదులు ఉదాహరణములు.

13