పుట:మధుర గీతికలు.pdf/732

ఈ పుట ఆమోదించబడ్డది

కశిపునిఁజించిచెండాడెను; నిజభక్తపరతంత్రునిఁ బ్రహ్లాదునిఁగాచి లోకములకు శాంతిఁజేకూర్చెను.

నేడు - బ్రిటీషు ప్రభుత్వమువారు పశుబలముచేఁ బ్రపంచము నెల్ల నాక్రమించుకొని, జగమునఁదమ కెవ్వరు నెదురు లేరని, రవి య స్తమింపని విశాలరాజ్యము తమ యధీనమున నున్నదని మురిసి దురహంకారాతిరేకమున మదోన్మత్తులై ఎల్లజాతులను హింసించుచు త్రుళ్ళిపడుచుండిరి. తొలుత గాంధీమహాత్ముఁడా ప్రభుత్వమున కాప్తుఁడై సాంత్వనవచనముల బుజ్జగించియు మందలించియు హితవులు గఱపెను. అతని యుపదేశములు సరకుగొనక ఆ ప్రభుత్వమువారు వానినిఁ బలువిధముల గాసి పఱిచి ఎప్పటియట్ల ప్రజాపీడనము గావించుచుండిరి. అందులకు గాంధీమహాత్ముఁడణు మాత్రము చలింపక సహజసాత్త్వికవృత్తితో హింసల కన్నిఁటికి సహించెను; వారు తమ కుటిలమార్గము విడనాడకుంటచే, నాతఁడు తుదకు నరసింహుడై శాంతిరణరంగమున నుఱికి, సత్యాగ్రహాస్త్ర ప్రయోగమున ప్రత్యర్థిలోకమును విభ్రాంతము గావించి తద్దహంకారమును బోనడఁచి, సకల లోకములందు పురుష సింహుఁడని ఖ్యాతింగాంచెను.

[ఇందు గాంధీమహాత్ముఁడు ప్రహ్లాదుఁడును నరసింహుఁడు నని యెఱుఁగునది].

5.వామనావతారము.

విశ్వవిక్రమణము,


తొల్లి - బలిచక్రవర్తి బాహుబలమున లోకముల నెల్ల జయించి యేలుచుండెను. శ్రీహరి వామనుఁడై యవతరించి,