పుట:మధుర గీతికలు.pdf/731

ఈ పుట ఆమోదించబడ్డది

4. నారసింహావతారము.

అహంకార విధ్వంసనము.


తొల్లి - హిరణ్యకశిపుడు అను దానవరాజు అహంకారాతిశయము పెంపున లోకముల నెల్ల నిర్జించెను. సాధుజనుల బాధించెను. సమస్తజగత్తులఁదనకంటె బలాధికుఁడు లేఁడని సర్వలోకములు తన్నే నియంతగాఁ గొలుచుచుండవలయునని శాసించి చెలరేఁగుచుండెను. ఆతనికొడుకు సకల కల్యాణగుణసంపన్నుడు, సాధుశీలుఁడునై శ్రీహరి నారాధించుచుండెను. హిరణ్యకశిపుఁడది సహింపక తనశాసనము నుల్లంఘించెనని కోపోద్దీపితుఁడై భటులచే ప్రహ్లాదకుమారుని నానాహింసలఁబెట్టించెను.


"తన్ను నిశాచరుల్, వొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి కో
పన్నగశాయి. యో దనుజభంజన, యో జగదీశ, యో మహా
పన్నశరణ్వ, యో నిఖిలపానివ, అంచు నుతించుఁగాని, తాఁ
గన్నుల నీరు దేఁడు, భయకంపసమేతుఁడు గాఁడు భూవరా.
"పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలో
దూఱఁడు; ఘోరకృత్య మని దూఱఁడు తండ్రిని; మిత్రవర్గముం
జీరఁడు ; మాతృసంఘమువసించు సువర్ణగృహంబులోనికిం
దాఱడు; కావరే యనడు; తాపము నొందఁడు; కఁటగింపఁడున్. "

                                                           --భాగవతము

ఇట్లు సాత్త్వికవృత్తితోఁ బరమశాంతుఁడై యున్న ప్రహ్లాదుని ఆత్మనిగ్రహమునకు నిశ్చలభక్తినిష్ఠకు మెచ్చి, శ్రీహరి నారసింహాకృతి నావిర్భవించి, నిజనిశాతనఖముఖముల హిరణ్య