పుట:మధుర గీతికలు.pdf/728

ఈ పుట ఆమోదించబడ్డది

బౌద్ధము - వైరాగ్యము.

కల్కి - ధర్మసంస్థాపనము.


“పరిత్రాణాయ సాధూనామ్‌ వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మసంస్థాపనార్థాయ సమ్భ వామి యుగే యుగే."

అను భగవద్గీతావచన ప్రకారము దుష్టులు చెలరేఁగి ధర్మ మడుగంటినప్పుడు, సాధువుల రక్షించుటకును ధర్మమును సంస్థాపించుటకును యుగయుగ మందును భగవంతుఁ డవతరించు చుండును,

ఆ ప్రకారము దుష్టశిక్షణము శిష్టరక్షణము గావించుటకు భగవంతుఁడు ఇంతదనుక తొమ్మిది యవతారముల నెత్తియున్నవాఁడు. ప్రకృతము ఈ కలియుగమున గాంధిరూపమున కల్కి. మూర్తియై యుద్భవించె ననియు, ఈ యవతారమునఁ గడచిన యవతారలీల లన్నియు మూర్తీభవించిన ననియు, ఈ గ్రంథము సాంకల్యముగఁ జదివినఁ దెలియనగును.

గాంధీ యవతార లీలలు

జీర్ణమతోద్ధరణము - మత్స్య

దీనసంరక్షణము - కూర్మ

పతితలోక సముద్ధరణము - వరాహ

అహంకార విధ్వంసనము - నారసిహ

విశ్వవిక్రమణము - వామన