పుట:మధుర గీతికలు.pdf/727

ఈ పుట ఆమోదించబడ్డది

(స్థితప్రజ్ఞ). తొమ్మిదవనెలపిదప బౌద్ధము-- (విజ్ఞానము). అంత ఆవిర్భావము.

2వ దశ. ఆవిర్భవించిన పిమ్మట పొత్తిట వటపత్త్ర శయనము. బోర్లపడుట మత్స్యము. ప్రాకుట కూర్మము. మోకాళ్ళ దోఁగుట వరాహము. నిలఁబడుట నారసింహము. హఠము పరశురామము. సంసారనిర్వహణము శ్రీరామము. ప్రపంచజ్ఞానము శ్రీకృష్ణము, వైరాగ్యము బౌద్ధము.

సృష్టిపరిణామము

మత్స్యము - ఆదిని సృష్టి జలమయము - జీవులు జలచరములు.

కూర్మము - కొంత భూభాగ మేర్చడినది - జీవులు జలము ననేగాక భూమిని గూడ జరించును.

వరాహము - మృగము - భూచర మయ్యు జలమునఁ గూడ బొరలాడును.

నారసింహము - నరమృగాకృతి.

వామనము - పరిణతిఁ జెందని మానవాకృతి.

పరశురామము - పెంకెపట్టుదల.

శ్రీరామము - పరిపూర్ణ మానవత్వము.

శ్రీకృష్ణము - విజ్ఞానము.