పుట:మధుర గీతికలు.pdf/726

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతిపరిణతిని దెలుపుటయే అవతారక్రమము యొక్క నిరూపణోద్దేశము. స్థావరజంగమాది ప్రకృతియంతయు నీశ్వర మయ మని యుపదేశించుటయు తత్పరమప్రయోజనము. భూత కోటియొక్క బాహ్యాభ్యంతర జీవనక్రమము సంగ్రహముగా పది ఘట్టములుగ విభజింపఁబడెను. ఆ ఘట్టములే అవతారములు.

ఆదిని శ్రీమహావిష్ణువు వటపత్రశాయి. పిదప మత్స్యాకృతితో ప్రారంభమై కల్కి మూర్తితో అవతారక్రమము సమాప్త మయ్యెను.

ఈ యవతారక్రమము మానవజీవనమున కెంత సన్నిహితమో యెఱుంగునది.

1. దశ. తల్లి గర్భమున బిందుపతన మైనది మొదలొక నెల వటపత్రశయనము. నెల దాటినది మొదలు మత్స్యము- (తలయు కాలు సేతులు ఏర్పడవు) రెండవనెల పిదప కూర్మము- (అవయవముల మొలక లగపడును). మూఁడవనెలపిదప వరాహము- (కాలు సేతులు తల స్పష్టపడి మృగమువలె నుండును). నాలవనెలపిదప నారసింహము. (నరమృగాకృతి). ఐదవనెల పిదప వామనము (మానవాకృతికి ఆదిమదశ). ఆఱవనెలపిదప పరశురామము- (శిశుసంచలనము). ఏటవనెలపిదప శ్రీరామము - (మానవత్వము సమగ్రమము). ఎనిమిదవనెలపిదప శ్రీకృష్ణము-

5