పుట:మధుర గీతికలు.pdf/725

ఈ పుట ఆమోదించబడ్డది

వేధించిరి; ఒకరితరువాత నొకరిని బంధింపఁబ్రారంభించిరి. కాని వారి యూహకు భిన్నముగా జరిగినది. ఉద్యమ మడుగంటుటకు మాఱుగా, పరస్సహస్రకరాళములతో వికసించి వీరతాండవ మారంభించినది. ఒక్కొక్క యోధుని జెఱఁబెట్టినప్పుడెల్ల వాని స్థానమున వందలకొలఁది యోధులు నవనవోత్సాహముతో రణాంగణమున నుఱికిరి.

ఒక్కొక సైనికుని చెఱఁబెట్టినపుడెల్ల అతని స్థానమున వేలకొలఁది సైనికులు ఆవిర్భవించి గుండుదెబ్బలకు దమగుండెల నొడ్డి మాతృదేశమునకు ఆత్మార్పణము గావింపఁజొచ్చిరి.

ఎట్టకేలకు బ్రిటీషురాజ్యతంత్రజ్ఞులు చేయునది లేక, 4 - 5 - 1930 తేదీని నడిరేయి గం॥ 12-45 నిమిషముల వేళ దొంగతనముగా ఆశ్రమమును ముట్టడించి గాఢనిద్రయందుండిన మహాత్ముని బందీకృతుం గావించిరి.

అవతారక్రమ రహస్యము


వేదా నుద్దరతే, గిరిం నివహతే, భూభాగ ముద్బిభ్రతే,
దైత్యం దారయతే, బలిం ఛలయతే, క్షత్రక్షయం కుర్వతే,
వార్దిం లజ్ఘ యతే, హలం కలయతే, వైరాగ్య మాతన్వతే.
మ్లేచ్ఛా నుచ్చలతే, శుభాయతనుతే దేవాయ తుభ్యం నమః.

4