పుట:మధుర గీతికలు.pdf/724

ఈ పుట ఆమోదించబడ్డది


"అమరశ్రేణికి నెల్లఁజక్రి ముఖరుం; డా చక్రియే ధర్మమం
దమరున్; గోవులు, భూమిదేవులు, తితిక్షామ్నాయకారుణ్యస
త్యములున్, యాగడపోదమంబులును, శ్రద్ధాంశాంతులున్ విష్ణుదే
హము; లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్.

"చంపుదుమే నిలింపులను జంకెల ఱంకెల ? తాపసావళిం
బంపుదుమే కృతాంతకుని పాలికి ? క్రేపులతోడ గోవులం
ద్రుంపుదుమే ? ధరామరులఁద్రోలుదుమే ?" నిగమంబులన్ విధా
రింపుదుమే ? వసుంధర హరింపుదుమే ? జననాధ, పంపుమా"

[శ్రీకృష్ణుని సంహరింపవలయు ననిన, అతని యవయవములగు గోపులు విప్రులు వేదములు సత్యశాంత శమదమాది సర్వసద్గుణములను రూపుమాపినచో, ఆతఁడు తనంతట తానే యంతరించును - అని దీనిభావము]


అని వచించి కంసుని పంపున-


"వెదకి వెదకి దైత్యవీరులు సాధుల
నడఁప, వారిబలము లడఁగిపోయె;
యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు
నార్యహింస సేయ నడఁగుఁగాదె "
                                              - భాగవతము


ఇట్లు ఆలోచించి, బ్రిటిషు రాజనీతిజ్ఞులు మహాత్ముని యనుచరులగు ప్రముఖులను శాంతిసైనికులను బట్టి బంధించినచో, ఆతఁడు నిస్సహాయుఁడై తన యుద్యమము నుజ్జగించునని నిశ్చయించిరి; ఉద్యమ మందలి నాయకుల బలువిధముల బాధించిరి;

3