పుట:మధుర గీతికలు.pdf/722

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ముని

దశావతారలీలలు


"ఇంతై, యింతకు నింతయై, మరియుఁ దా నింతై, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమున నల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ద్రువనిపై నంతై మహర్యాటిపై
నంతై (గాంధిమహోద్యమం) బడరె బ్రహ్మాండాంతనంవర్థియై"

సత్యాగ్రహోద్యమము మహావటవృక్షము వంటిది. ఈ వృక్షమునకు గాంధిమహాత్ముడు కూకటివేరు. ఈమహీరుహము వేళ్ళు రసాతలమునఁ బాదుకొని, దాని శాఖలు భూమండలమున దిశదిశల వ్యాపించి, ఆకాశపథము నధిగమించి, చంద్ర బింబము నాక్రమించి, సూర్యమండలము నతిక్రమించి, ధ్రువ లోకము నవఘళించి, బ్రహ్మాండభాండము నెల్ల నిండి నిబిడీకృతమై యున్నవి.

ఈ మహాభూరుహరాజమును సమూలముగఁ బెకలించుటకు బ్రిటీషు రాజనీతిజ్ఞులు తలపడిరి. తొలుత దీని కొమ్మలు రెమ్మలు దళములు ద్రుంచినచో, ఈ వృక్షరాజము నిలువున నీరసించి నశించు నని భ్రమపడిరి. అట్లు గావించినచో, నిది

1