పుట:మధుర గీతికలు.pdf/721

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీ గ్రంథమాల

ప్రధమ ప్రసూనము

మున్నుడి

ఈ గ్రంథమును నేను పెక్కు సంవత్సరముల క్రితము, (మహాత్ముఁడు ఎరవాడ జైలులో బంధింపఁబడిన యనంతరము) విరచించియుండియు, కారణాంతరములచే నింతదనుక ప్రచురింపఁ జాల నైతిని. దీనిని నేను రచించిన పిమ్మట నింతకాలము వరకు, మహాత్ముని జీవితమున జరిగిన అనేక సన్నివేశముల నిందు జేర్పవలసియుండియు, అట్లు చేయుటచే కొంత కాలహరణ మగు నను భీతిచేతను, ఈ విషాద సమయమున పాఠక లోకమునకీ గ్రంథము సత్వరమునఁ బ్రదర్శింప వలయు నన్న తహతహ చేతను, వాని నెల్ల విడువవలసినవాఁడ నైతిని. వాని నన్నిటిని ద్వితీయ ముద్రణమున జేర్చుటయె కాక, మహాత్ముని నిర్యాణ ఘట్టము గూడ సంతరింపఁగలవాఁడ నని విన్నవించు కొనుచు న్నాఁడ.

ఈ గ్రంథ విక్రయమున లభించు ధనమును మహాత్ముని గూర్చిన గ్రంథముద్రణ కార్యములకు వినియోగించి, నా జన్మమును ధన్యమొనరింప సంకల్పించినాఁడను.

27 - 2 - 1948

రాజమందిరము

ఇట్లు విన్నవించు

కృతికర్త