పుట:మధుర గీతికలు.pdf/714

ఈ పుట ఆమోదించబడ్డది



"రాణ నొప్పారు నాంధ్రసారస్వతాబ్ధి
కావ్యమణు లెన్నియో నేఁటి కాలమందు;
వాని నెల్లను సరిపోల్చవచ్చు నొక్క
తావకానూన కావ్యరత్నంబు తోడ?”

మేలు మే లని 'శారద' చాల మెచ్చె
ఔర యని 'ఆంధ్రపత్రిక ' యభినుతించె,
బళిబళీ యని 'భారతి' తలను దాల్చె;
అహహ! ఎంతటి ధన్యుండ వయ్య నీవు!

మృతుని బ్రతికించు సతతంబుఁ గతి యటంచు
వలుకుదురు గాన నీ కృతి వ్రాసినాఁడ ;
ధరణి నీ కృతి వెలయునందాఁక నీవు
బ్రతికియున్నట్లె భావింతు భావమందు.

'తండ్రిబిడ్డల యన్యోన్య తత్పరత్వ
మవని నెందాఁక నుండునో' అంతదాఁక
వెలయుఁ గావుత 'పాపాయి' విమలకీర్తి
విబుధమానస రాజీడవీథులందు.

79