పుట:మధుర గీతికలు.pdf/712

ఈ పుట ఆమోదించబడ్డది

కృ తి ప్ర శం స



నీయెడల నాకుఁ గలిగిన నిండు ప్రేమ
వెల్లడింపఁగఁ బదములు వెలితివడును,
కుంటువడు ధార పద్యముల్ కూర్చు నెడల
ఎట్లు వర్ణింతునో నాకె యెఱుక లేదు.

గాఢ శోకానలంబునఁ గ్రాఁగి క్రాఁగి
హృదయ మను కుప్పెలోపల నివిరియున్న
భావరసమును గన్నీటఁ బదనుకొలిపి
వ్రాయుచుంటిని నీపేర పద్దియములు.

అక్కరము కొక్క కన్నీటి చుక్క గాఱ
వ్రాయుచుంటిని నీ పేర పద్దియములు;
ఎంత వ్రాసిన పద్దెంబు లంత మొంద,
వివురఁ బాఱదు కన్నీటియేటిజాలు.

నీ వియోగవ్యధాంబుధి నిస్తరింపఁ
కడఁగి, కబ్బంబు తెప్పగాఁ గైకొనంగ,
పైకి తేలించుటకు మాఱు లోని కీడ్చి
ముప్పుతిప్పులఁ బెట్టి నన్ ముంచుచుండె.

77