పుట:మధుర గీతికలు.pdf/708

ఈ పుట ఆమోదించబడ్డది



నిండు వేడుక సంక్రాంతిపండు గంచు
ఎల్లజనములు బంధుల యిండ్ల కేఁగి
హర్షవారాశిలో నోలలాడు చుండ,
అకట; పడియుంటి నింట దివాంధమట్లు.

ఉత్సవంబులలోన సంవత్సరాది
సకలజనులకు సఁతోషజనక మయ్యు,
అధిక సంతాపకారణ మయ్యె నాకు.
స్మృతికిఁ దెచ్చుటఁజేసి నీ మృతిని గూర్చి.

73