పుట:మధుర గీతికలు.pdf/705

ఈ పుట ఆమోదించబడ్డది



తనదు నవ్యక్త మధుర గీతంబు లనుచు
కాలు సేతుల యల్లార్పు తాళములుగ
వెలికిల పరుండి క్రీడించు బిడ్డఁ డెన్న
లోకకల్యాణమునకు మాఱకు గాఁడె ?

వెండిపళ్ళెరమందున వెలుఁగుచున్న
కప్పురపుదీపమో యన నొప్పు మీఱు,
జిలుఁగు వెల్లని దుప్పటి సెజ్జమీఁద
ఠీవిఁ గూర్చుండి క్రీడించు డింభకుండు.

70