పుట:మధుర గీతికలు.pdf/704

ఈ పుట ఆమోదించబడ్డది



కన్నె వెన్నెలకన్నను, వెన్న కన్న,
మంచుబిందులకన్నా, క్రొమ్మించుకన్న,
కునుమ మకరందమునకన్న కోమలంబు'
చిఱుతపాపల చిన్నారి చిన్ని నగవు.

నల్లనివియెల్ల నీళ్ళును తెల్ల వెల్ల
పాలు నంచును సూటిగాఁ బలుకుచుండు,
కల్ల కపటంబు నెఱుఁగఁడు పిల్లవాఁడు ;
బిడ్డఁ డన దేవుఁ డన వేఱె భేద మున్నె

ఆడు, నేడుచు, పలవించు, పాడు, సోలు,
తేఱిపాఱఁగఁ దిలకించు, కేరి నవ్వు,
గొణుఁగుఁ దనలోన, వేదురు గొన్న భంగి
నుండు; పసిపాప కేవల యోగి కాఁడె?

ఠీవి బొట వేలె పిల్లనగ్రోవి గాఁగ
మోవిఁ గీలించి యెల్లరు మోహజలధి
నోలలాడఁగ గానంబు నాలపించు
ముద్దుబిడ్డఁడు గోపాలమూర్తి కాఁడె?

69