పుట:మధుర గీతికలు.pdf/702

ఈ పుట ఆమోదించబడ్డది

బి డ్డఁ డు



చిన్నబిడ్డల మృతి కింత చింత యేల?
అంచు మిత్రులు న న్నూరడించుచుందు
రెన్ని విధముల వారించుకొన్నఁ గాని
అలవి గా దయ్యె నాదుఃఖ మపనయింప.

పెద్దవారలు మరణింప తద్దినములఁ
బెట్టుచుందురు శ్రద్ధతో, పిన్న వారి
మరణమును గూర్చి చేయరు స్మరణమేని
ఇట్టి భేదంబు గలుగుట కేమి కతమొ?

వయసునం దెన్నఁ దక్కువ యయిన నేమి ?
ముద్దు ముచ్చటలందును మురిపమందు
అలఁతి యగు నొక్కొ ? అధికంబ యగును గాక
పెద్దవారలకంటెను పిన్న వాఁడు.

ప్రియము గూర్తురు కూర్ప రప్రియము నెపుడు
మోదమే కాని భేదంబుఁ బొరయనీరు;
పెద్దవారలకంటెను పిన్నవారె
కొల్లగొందురు పితరుల యుల్లములను.

67