పుట:మధుర గీతికలు.pdf/700

ఈ పుట ఆమోదించబడ్డది



అక్కటా! ఏమి చెప్పుదు - నొక్క రేయి
నీవు తలంపునం బాఱంగ నిదుర రాక
దిగ్గురని పాన్పుపై నుండి డిగ్గనుఱికి
క్రుమ్మరిల్లితి కొఱవిదయ్యమ్ము రీతి.

నిన్నుఁ గన్నట్లు, ముద్దిడుకొన్నయట్లు,
కౌఁగలించిన యట్టులు కలలు గాంచి
ఉలికిపాటున లేచి నేనొక్క రేయి,
పడిన దురవస్థ యెల్ల దైవంబె యెఱుగు.

ఏను పురవీధిఁ జనుచుండ, హితుఁ డొకండు
‘కొడుకు లెందఱు నీ' కని యడిగె నన్ను;
పిడుగుఁ బోలిన యామాట వినినయంత
చిత్తరువురీతి నిలిచితి చేష్ట లుడిగి.

నేఁడు నడువీథిఁ జనుచుండ నిన్నుఁ బోలు
బూరిబుగ్గల బుడుతండు తారసిల్ల,
కాంక్ష దీఱ నెగాదిగఁ గాంచుచుంటి
వ్రీడచే వాఁడు నెమ్మోముం ద్రిప్పుకొనియె.

65