పుట:మధుర గీతికలు.pdf/698

ఈ పుట ఆమోదించబడ్డది



పాలుఁగన్నులఁ గూరీమి జాలువాఱ
గొనబుమాటలఁ జూపఱఁ గుస్తరించి
పలుకరించెడిరీతి నీ కులుకుచూపు
డంబు మీఱెడు ఛాయాపటంబునందు.

ఇహసుఖంబుల పైఁ గడు సేవ పుట్ట
మోక్ష మరించి తపమును బూని సేయ
యోగముద్రను గొననున్న యోగిలీల
చిత్రపటమున నీ మూర్తి చెన్ను మీఱు.

ఎట్టయెదుటను శ్రీహరి నట్టె కాంచి
పరవశంబున సకలంబు మఱచియున్న
ధ్రువుఁడొ ప్రహ్లాదుఁడో యని తోఁచులీల
చిత్రపటమున నీ మూర్తి చెన్ను మీఱు.

మానవాళికి దుర్లభ మైన యట్టి
దెద్దియో వింతవస్తువు నెదుటఁ గాంచి
దానిఁ జేకొన తహతహ పూనినట్లు
చిత్రపటమున నీ మూర్తి చెన్ను మీఱు,

63