పుట:మధుర గీతికలు.pdf/697

ఈ పుట ఆమోదించబడ్డది



చెప్ప సిగ్గగు - నొకసారి చిత్రపటము
గాంచి సంభ్రమ మొంది నిక్కముగ నీవే
యనుచు నేమేమొ చేసితి! నకట! నాదు
చిత్తవిభ్రాంతి యే మని చెప్పువాఁడ?

బాళి నొకసారి నీ చిత్రపటముఁ గాంచి
ఔర! యిటువంటి మోహనాకారు నాదు
పట్టిగాఁ గొన్ని నాళ్ళైనఁ బడయు భాగ్య
మబ్బెఁ గా యని యానంద మనుభవింతు.

చిత్ర మది యేమొ కాని, నీ చిత్రపటము
నాస దీఱఁగఁ గాంచినయప్పు డెల్ల
పూజ్యభావంబు నామదిఁ బొంగిపొరల
మౌళి యొక్కింత వంచి నమస్కరింతు.

ప్రేక్షకచకోరముల కోర్కి క్రేళ్ళువాఱ
కన్నుదొన్నెల జిగినవ్వు వెన్నెలలను
కొసరి వడ్డించుగతి, నీదు కులుకుచూపు
డంబు మీఱెడు ఛాయాపటంబునందు.

62