పుట:మధుర గీతికలు.pdf/695

ఈ పుట ఆమోదించబడ్డది



చిత్ర మది యేమియో కాని చెప్పఁజాల-
నిన్నుఁజూచినతోనె నాకన్న కొడుకుఁ
గాంచినటు లుండుఁ గాన, నాకస్తి యెల్లఁ
దెలిపికొంటిని ఇంక పెక్కు పలుకు లేల?

కడుపుతీపుకొలందిని నుడివినాఁడ,
నీవెఱుఁగని ధర్మంబు లెందు నైనఁ
గలవె? నీటను ముంచెదో? కరుణ నన్ను
పాలముంచెదవో నీదె భార మయ్య !

తూర్పుదిక్కున నల్లదే తొంగిచూచు
చుండె భాస్కరుఁ, డింక నీవుంటి వేని
కరఁగిపోఁగల వాతని కిరణములను
మూసలోఁబడ్డ బంగారుపూస భంగి.

60